న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: టెలికాం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రిటైల్ అవుట్లెట్లకు వెళ్లి సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు..ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది..తమ ఇంటికి కేవలం పది నిమిషాల్లో సిమ్‌ను డెలివరి చేస్తున్నది సంస్థ. ఇందుకోసం ఎయిర్టెల్..క్విక్ కామర్స్ సేవల సంస్థ బ్లింకిట్‌తో జత కట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా సిమ్‌ను బుకింగ్ చేసుకున్నవారు కేవలం పది నిమిషాల్లోనే తమ సిమ్‌ను పొందవచ్చునని పేర్కొంది.
ఈ సేవలు దేశవ్యాప్తంగా 16 నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబైతోపాటు పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం కస్టమర్ ఫీజు కింద రూ.49 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. సిమ్ డెలివరి అయిన తర్వాత కస్టమర్..ఆధార్‌తో కేవైసీ ధృవీకరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సిమ్ డెలివరి అయిన తర్వాత 15 రోజుల లోపు ఈ సిమ్‌ను యాక్టివేట్ చేయాలని సూచించింది.