Gold Seize | బెంగాల్లో రూ.60 లక్షల విలువైన స్మగ్లింగ్ బంగారం జప్తు..!
Gold Seize | భూటాన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పశ్చిమ బెంగాల్ లో డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. దాని విలువ రూ.60 లక్షలు ఉంటుందని తెలిపారు.
Gold Seize | పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురిలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.60 లక్షల విలువ చేసే బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేశారు. సదరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విశ్వసనీయ వర్గాలకు అందిన సమాచారం మేరకు పనికౌరీ టోల్ ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేశారు.
సదరు వ్యక్తుల నుంచి 51 బంగారం బిస్కట్లు, రూ.2.09 లక్షల విలువైన 2500 అమెరికా డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాకీ బర్మన్, కంచన్ భట్టాచార్యగా గుర్తించారు. నిందితులిద్దరూ పశ్చిమ బర్దమాన్ జిల్లా వాసులని విచారణలో తేలింది. భూటాన్ అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారు. సిలిగురిలో ఒక వ్యక్తిని సదరు బంగారం అప్పగించాల్సి ఉందని నిందితులు చెప్పారని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

