ముంబై, సెప్టెంబర్ 6: పాతికేళ్ల లోపు వయస్సుకలిగిన గ్రాడ్యుయేట్లలో బ్యాంకు లు నియమించుకోవాలని, వారికి ైస్టెపెండ్ కింద రూ.5 వేలతోపాటు బ్యాంకింగ్ విభాగంలో శిక్షణ కూడా ఇవ్వాలని బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా సూచించారు. వచ్చే ఐదేండ్లలో కోటి మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
రెడ్డీస్ ప్లాంట్‌లో తనిఖీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు శ్రీకాకుళంలో ఉన్న ప్లాంట్‌లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించింది.