ముంబై, ఏప్రిల్ 9: ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో అందుకు తగ్గట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని బ్యాంకులూ ఇదే దిశగా వెళ్లనున్నాయి. ఇక ఇండియన్ బ్యాంక్ 35 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి రెపో లింక్డ్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఆర్బీఎల్ఆర్)ను తెచ్చింది. ఈ నెల 11 నుంచి అమల్లోకి వస్తుంది. పీఎన్బీ ఆర్బీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గింది. గురువారం నుంచి అమలవుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఎల్ఆర్ కూడా పావుశాతం తగ్గి ఇదే స్థాయిలో దిగొచ్చింది. యూకో బ్యాంక్ రెపో లింక్డ్ రేటు 8.8 శాతానికి తగ్గింది. గురువారం నుంచి అమల్లోకి వస్తుంది.