న్యూఢిల్లీ, జనవరి 16: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,036 కోట్ల నికర లాభాన్ని గడించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో 34 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.775 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.4,770 కోట్ల నుంచి రూ.5,851 కోట్లకు చేరుకున్నట్టు బీవోఎం ఎండీ ఏఎస్ రాజీవ్ తెలిపారు.