Bank of India MCLR Rise | మిగతా బ్యాంకుల బాటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కీలక వడ్డీరేట్ల పెంపు
Bank of India MCLR Rise | సెలెక్టెడ్ టెన్యూర్ రుణాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎంసీఎల్ఆర్ 15 బేసిక్ పాయింట్లు పెంచేసింది.
Bank of India MCLR Rise | ఆర్బీఐ రెపోరేటు పెంపుకు అనుగుణంగా కీలక వడ్డీరేట్లు పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేరింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కూడా ఇండ్ల రుణాలతోపాటు వివిధ రకాల రుణాలపై కీలక వడ్డీరేట్లు పెంచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 15 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణ గ్రహీతలపై దాని పెంపు వల్ల వారి ఈఎంఐ భారం పెరుగుతుంది.
ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతం నుంచి 7.50 శాతానికి పెరుగుతుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.05, 7.10, 7.20 శాతానికి పెరుగుతుంది. అయితే 15 రోజుల గడువు రుణాల నుంచి మూడేండ్ల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ మాత్రం 2.90, 7.70 శాతంగా యధాతథంగా కొనసాగిస్తున్నది.
గత మే నెల నుంచి ఆర్బీఐ రెండు దఫాలు రెపోరేట్ 90 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో రెపోరేట్ 4.90 శాతానికి పెరిగింది. వివిధ వస్తువుల ధరల భారం, అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల వడ్డీరేట్లు మరింత పెరుగుతాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bank of india
- MCLR
- rbi
- Reporate
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

