Bank of India | బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తన ఖాతాదారులకు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ప్రకటించింది. 666 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో రూ.2 కోట్ల లోపు తక్కువ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం వరకూ వడ్డీ ఆఫర్ చేస్తున్నది. 80 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పౌరులను సూపర్ సీనియర్ సిటిజన్లు అని చెబుతారు.
666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తెలిపింది. భారత్ పౌరులు, ఎన్ఆర్ఐ, ఎస్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు కూడా ఈ సవరించిన డిపాజిట్లు వర్తిస్తాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణ సౌకర్యం, ప్రీ మెచ్యూర్డ్ విత్ డ్రా వసతి అందుబాటులో ఉంటుంది. బ్యాంకు ఖాతాదారులు, సాధారణ పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వెల్లడించింది. బీఓఐ ఓమ్నీ నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవచ్చునని పేర్కొంది.