ముంబై, జూలై 7: బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో 999 రోజుల కాలపరిమితి కలిగిన గ్రీన్ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతం నుంచి 6.70 శాతానికి దించిన బ్యాంక్..పొదుపు ఖాతాలపై వడ్డీని 2.75 శాతం నుంచి 2.50 శాతానికి తగ్గించింది.
న్యూయార్క్, జూలై 7: టెస్లా షేర్లు కుప్పకూలాయి. కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదరడంతో సోమవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు 8 శాతం వరకు నష్టపోయింది.