Bank of Baroda | ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తీపి కబురందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఈ వడ్డీరేట్లు పెరిగాయి. వివిధ రకాల టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 బేసిక్ పాయింట్లు (0.20 శాతం) వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. ఏడాది గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ ఏదా ఎన్నార్వో (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) టర్మ్ డిపాజిట్‌పై 5.30 నుంచి 5.50 శాతానికి పెరిగింది. 400 రోజుల నుంచి మూడేండ్ల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.45 నుంచి 5.50 శాతానికి పెంచేసింది. మూడేండ్ల నుంచి పదేండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.65 శాతానికి పెరిగింది. ఏడాది గడువు గల సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అధికంగా 5.80 నుంచి ఆరు శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్ల ఇతర టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.95-6.50 నుంచి 6-6.65 శాతానికి వడ్డీరేట్లు పెంచేసింది.
`బరోడా టాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్` పథకంలో ఖతాదారులు చేసే డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేసింది. ఈ పథకం కింద ఐదు నుంచి 10 ఏండ్ల టెన్యూర్ డిపాజిట్లపై 0.15 శాతం పెంపుతో 5.65 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీ ఆఫర్ చేసింది. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు దేశీయుల డిపాజిట్లు, ఎన్నార్వో అండ్ ఎన్ఆర్ఈ (నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్) ఖాతాదారులకు 5.65 నుంచి 5.80 శాతానికి వడ్డీ పెంచింది.
బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్ కింద 444 రోజులు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ 5.75, 555 రోజుల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఆరు శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ పథకం వచ్చే డిసెంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం, నాన్కాలబుల్ డిపాజిట్లపై అదనంగా 0.15 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.