తమిళ అగ్ర నటుడు సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. నజ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లెన్, ఆనంద్‌రాజ్, రాజ్ ప్రియన్ ఇతర ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు హెచ్.వినోద్, లోకేష్ కనకరాజ్, టీజే జ్ఞానవేల్ వంటి అగ్ర దర్శకులతో వరుస భారీ చిత్రాల్లో నటిస్తున్నారు సూర్య.