న్యూఢిల్లీ, జూలై 4: గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేటు 7.45 శాతానికి దిగొచ్చింది. నెల రోజులక్రితం 8 శాతం నుంచి 7.50 శాతానికి దించిన సంస్థ..ఈసారి మరో ఐదు బేసిస్పాయింట్లు కోత పెట్టినట్టు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలైర్ తెలిపారు.
గృహ రుణాలు తీసుకునేవారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీంతోపాటు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు గృహ రుణాలకోసం ధరఖాస్తు చేసుకునేవారు ఇక నుంచి ఆన్లైన్లో చేసుకోవచ్చునని సూచించింది.