పూణె, జనవరి 14 : దేశీయ మార్కెట్లోకి నయా ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది బజాజ్ ఆటో. ఇప్పటికే ఎంతోమంది కస్టమర్లను ఆకట్టుకున్న సంస్థ..తాజాగా చేతక్‌లో మరో మాడల్‌ను తీసుకొచ్చింది. సీ25 పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.91,399గా నిర్ణయించింది. 2.5 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 113 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న అన్ని రిటైల్ అవుట్లెట్లలో ఈ స్కూటర్ లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం 2.25 గంటల్లో 80 శాతం చార్జింగ్ కానున్న ఈ స్కూటర్ గంటకు 55 కిలోమీటర్లు దూసుకుపోనున్నది.