e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News Bajaj Fin Serv Home loans | చౌక వ‌డ్డీకే ఇంటి రుణం.. బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌

Bajaj Fin Serv Home loans | చౌక వ‌డ్డీకే ఇంటి రుణం.. బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌

Bajaj Fin Serv Home loans | ఫెస్టివ్ సీజ‌న్ నేప‌థ్యంలో అన్ని బ్యాంకులు, బ్యాంకేత‌ర ఆర్థిక సంస్థ‌లు (ఎన్బీఎఫ్‌సీ) ఇండ్ల రుణాల‌పై వ‌డ్డీరేట్లు చాలా త‌గ్గించాయి. గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం వ‌డ్డీరేట్లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. తాజాగా ఇంటి రుణాల‌పై వ‌డ్డీరేట్లు త‌గ్గించిన సంస్థ‌ల జాబితాలో బ‌జాజ్ ఫిన్ స‌ర్వీసెస్ చేరింది. వేత‌న జీవులకు, వృత్తి నిపుణుల‌కు 6.70 శాతానికే ఇండ్ల రుణాలు మంజూరు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. నిబంధ‌న‌లకు అనుగుణంగా రూ.5 కోట్ల వ‌ర‌కు లోన్ తీసుకోవ‌చ్చు. ప్ర‌తి రూ.ల‌క్ష రుణంపై రూ.645 నెల‌స‌రి వాయిదా చెల్లించాలి.

రుణం చెల్లింపు గ‌డువు 30 ఏండ్ల వ‌ర‌కు పొడిగించుకోవ‌చ్చు. క్రెడిట్ స్కోర్‌, ఆదాయం ప్రొఫైల్ ఉన్న వారికి 6.70 శాతం ఇంటి రుణం ల‌భిస్తుంది. అంతే కాదు ఇత‌ర బ్యాంకుల్లో అధిక వ‌డ్డీపై ఇండ్ల రుణాలు తీసుకున్న వారు.. ఆ రుణాన్ని బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చున‌ని తెలిపింది. అంతే కాదు టాప‌ప్ లోన్ కూడా ఇస్తామ‌ని వివ‌రించింది.

- Advertisement -

ఆస‌క్తి గ‌ల వారు.. వెబ్‌సైట్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో సంబంధిత సంస్థ బ్రాంచ్‌లో గానీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.ఆన్‌లైన్ ధ‌ర‌ఖాస్తుదారులు కాంటాక్ట్‌-ఫ్రీ లోన్ అప్లికేష‌న్ నుండి ప్ర‌యోజ‌నం పొందుతారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు దారుల ప్ర‌క్రియ అంతా ఫోన్ కాల్స్‌, ఈ-మెయిల్ ద్వారానే పూర్త‌వుతుంది. తుది ద‌శ‌లో మాత్ర‌మే నేరుగా రుణ గ్ర‌హీత‌లు హాజ‌రు కావాల్సి ఉంటుంది.

సొంతింటి రుణాలు తీసుకున్న వారికి ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (పీఎంఏవై) కింద ఈడ‌బ్ల్యూఎస్‌.. ఎల్ఐజీ గృహ రుణ‌దారుల‌కు వ‌డ్డీ ల‌భిస్తుంది. వేత‌న జీవులైతే సంబంధిత సంస్థ‌ల్లో మూడేండ్లు ప‌ని చేసి ఉండాలి. 23 ఏండ్లు దాటిన వారికి రుణానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే అర్హ‌త ఉంది. 62 ఏండ్ల లోపు ఇండ్ల రుణం చెల్లించి వేయాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement