Aurobindo Pharma | హైదరాబాద్, మే 3: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు జీఎస్టీ అథార్టీ షాకిచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయింనకు సంబంధించి వడ్డీని కలుపుకొని రూ.13 కోట్ల జరిమానా విధించింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం, 2017 ప్రకారం, టీజీఎస్టీ యాక్స్ 2017 ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిం దాఖలు చేయకపోవడంతో ఈ నోటీసు జారీ చేసినట్లు హైదరాబాద్లోని పంజగుట్ట డివిజిన్ డిప్యూటీ కమిషనర్(ఎస్టీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐటీసీతోపాటు జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి రూ.6,54,50,645 జరిమానపై రూ.5,92,20,900 వడ్డీ కలుపుకొని పెనాల్టీ కింద మరో రూ.65,51,354 విధించింది.