Audi | న్యూఢిల్లీ, ఆగస్టు 22: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. దేశీయ మార్కెట్లోకి నయా మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లను నెలకొల్పింది.
వైర్లెస్ చార్జింగ్, రెండు డిజిటల్ స్క్రీన్లు, 3డీ సౌండ్ సిస్టమ్‌తో 17 స్పీకర్లు వంటి ఫీచర్లతో ఈ నయా కారును తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ..ఈవీలతో పోలిస్తే హైబ్రిడ్ వాహనాలపై అత్యధికంగా 43 శాతం పన్నును విధిస్తున్నారని, దీనిని తగ్గించాలన్నారు. గత 15 ఏండ్లలో లక్ష యూనిట్లను దేశీయంగా విక్రయించింది.