Ather Rizta | బెంగళూరు, ఏప్రిల్ 6: ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ..దేశీయ మార్కెట్‌కు నయా స్కూటర్‌ను పరిచయం చేసింది. రిజ్టా పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ రిజ్టా ఎస్, రిజ్టా జెడ్ మాడళ్లు.
సింగిల్ చార్జింగ్‌తో 2.9 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 123 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, 3.7 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 160 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. సీటు కింద 34 లీటర్ల స్టోరేజీ స్పేస్ కలుపుకొని మొత్తంగా 56 లీటర్ల స్టోరేజీతో తయారు చేసింది. ఫోన్లు, ట్యాబ్లెట్స్, పోర్టబుల్ స్పీకర్లు చార్జింగ్ చేసుకోవచ్చును. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ మాడల్‌పై ఐదేండ్లు లేదా 60 వేల కిలోమీటర్ల వ్యారెంటీ సదుపాయం కల్పించింది. సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన రెండో మాడల్ ఇది కావడం విశేషం.