Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్ (India)లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియాలో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణెలో రిటైల్ స్టోర్ల (Apple Retail Store)ను తెరిచిన సంస్థ.. ఇప్పుడు మరో స్టోర్‌ను తెరిచేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 11న అంటే రేపే నోయిడా (Noida)లో కొత్త స్టోర్‌ను తెరవబోతోంది. ఇది నోయిడాలో తొలి రిటైల్ స్టోర్ కాగా దేశంలో ఐదోది (Apple Retail Store).
నోయిడా సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్ (DLF Mall)లో ఈ కొత్త స్టోర్ లొకేట్ అయ్యిఉంది. ఈ స్టోర్‌లో మొత్తం 80 మంది టీమ్మెంబర్స్ ఉంటారు. ఈ స్టోర్‌ను సందర్శించే కస్టమర్లు ఐఫోన్ 17 సిరీస్‌తో సహా కొత్త ఉత్పత్తి శ్రేణిని అన్వేషించవచ్చు. కొత్త ఫీచర్ల గురించి తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఐఫోన్, మాక్, యాపిల్ వాచ్, ఐప్యాడ్ వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు.
కాగా, భారత్‌లో యాపిల్ తన తొలి రిటైల్ స్టోర్‌ను 2023 ఏప్రిల్‌లో ముంబై బీకేసీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఇదే అతిపెద్ద యాపిల్ స్టోర్. ఆ తర్వాత రెండో స్టోర్‌ను అదే ఏడాది ఢిల్లీ సాకేత్‌లో ఓపెన్ చేసింది. ఈ రెండు స్టోర్ల నుంచి తొలి ఏడాదే సంస్థకు దాదాపు రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది సెప్టెంబర్2వ తేదీన బెంగళూరు ఫీనిక్స్ మాల్లో మూడో స్టోర్, అదే నెల 4వ తేదీన పూణెలోని కోరెగావ్ పార్క్‌లో నాలుగో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి.
Also Read..
Amazon | 2030 నాటికి భారత్‌లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. భారీగా ఉద్యోగాలు
IndiGo | ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన ఇండిగో సంక్షోభం.. రూ.1,000 కోట్ల నష్టం
మైక్రోసాఫ్ట్ 1.58 లక్షల కోట్ల పెట్టుబడి