iPhone 16 | ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన తదుపరి మోడల్ ఐఫోన్ 16ను (iPhone 16) యాపిల్ (Apple) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్ఫాడ్స్ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ ప్రొ 2లను కూడా సంస్థ లాంచ్ చేసింది. సోమవారం కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఈవో టిమ్ కుక్ ఈ ఉత్పత్తులను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వాటి విశేషాలను పంచుకున్నారు.
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధర, ఇతర వివరాలు..
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొమ్యాక్స్ అనే నాలుగు మోడళ్లను యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్ ఫోన్లు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో వీటిని మరింత శక్తిమంతంగా రూపొందించింది. అధునాతన కెమెరా కంట్రోల్ పీఛరుతో పాటు కొత్త బటన్లు కూడా ఉన్నాయి. కొత్త సిరీస్ ఫోన్లలో ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18ను అమర్చారు. ఈ కొత్త 16 సిరీస్ ఫోన్లను ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో రూపొందించారు. గ్లాస్ బ్యాక్ ఫోన్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం.
ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర వివరాలు..
128 స్టోరేజీతో కూడిన ఐఫోన్ 16 బేస్ డిస్ప్లే 6.1 అంగుళాల పొడవు.
వెనిలా వేరియంట్‌తో దీన్ని రూపొందించారు.
ఐవోఎస్ 18తో ఇది పనిచేస్తుంది.
2000 నిట్స్ వరకు బ్రైట్నెస్ను పెంచుకోవచ్చు.
ఇక మోడల్ ఫోన్ ధర రూ.79,900 నుంచి ప్రారంభ అవుతుంది.
ఐఫోన్ 16 ప్లస్
128 స్టోరేజీతో కూడిన ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900తో ప్రారంభం కానుంది.
ఈ ఫోన్ డిస్ప్లే 6.7 అంగుళాల పొడవుతో ఇచ్చారు.
ఇందులో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.
వెనుక వైపు 48 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు.
12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది.
ముందువైపు సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా అమర్చారు.
అదేవిధంగా కెమెరా కంట్రోల్ బటన్‌తో చాలా ఈజీగా ఫొటోలూ, వీడియోలు తీసుకోవచ్చు.
ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీలలో అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లు ముందస్తు బుకింగ్‌లు సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. అలాగే సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఇక ఐఫోన్ 16 ప్రొ, ప్రొమ్యాక్స్ ఫోన్ల విషయానికొస్తే..
ప్రొ డిస్ప్లే 6.3 అంగుళాలు, 16 ప్రొమ్యాక్స్ 6.9 అంగుళాలతో ఉంటుంది.
ఈ రెండు మోడళ్లలో అడ్వాన్స్డ్ కూలింగ్ ఛాంబర్ ఫీచర్ ఉందని సంస్థ ప్రకటించింది.
ఈ ప్రొ మోడళ్లలో 4k120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయొచ్చు.
128 జీబీ స్టోరేజీ గల బేస్ మోడల్ 16 ప్రొ ధర రూ.1,19,900
256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చే 16 ప్రొమ్యాక్స్ ధర రూ.1,44,900తో ప్రారంభం కానుంది.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉంటాయి. అలాగే 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంటాయి. భారత్‌లో ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్‌లను ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Also Read..
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
MGM Hospital | ఎంజీఎం హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని గొలుసుతో కట్టేసి దాడి..వీడియో
Rahul Gandhi | ప్రధాని మోదీపై నాకు ఎలాంటి ద్వేషం లేదు : రాహుల్ గాంధీ