Apollo Pharmacy | ప్రముఖ ఓమ్నీ చానెల్ ఫార్మసీ రిటైలర్ అపోలో ఫార్మసీ దేశంలో 5000వ స్టోర్‌ను ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని పెరుంగుడిలో ఈ స్టోర్ ప్రారంభించారు. ఇందులో ఆడియాలజీ, ఓప్టోమెట్రీ సేవలు కూడా పొందొచ్చు. డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచే ల్యాబ్ టెస్ట్ నమూనాలను సేకరించాలని కోరొచ్చు.
దేశవ్యాప్తంగా 60 కోట్ల మందికి పైగా భారతీయులు భౌతికంగా అపోలో ఫార్మసీ సేవలు వినియోగించుకుంటున్నారని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్‌పర్సన్ శోభనా కామినేని తెలిపారు. ప్రస్తుతం తాము ప్రతి రోజూ ఏడు లక్షల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో 10 లక్షల మందికి సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.