Investers Wealth | వరుసగా ఐదు రోజులు స్టాక్‌మార్కెట్లలో స్క్రిప్ట్‌లు పతనం కావడంతో ఇన్వెస్టర్లు రూ.8,08,067.6 కోట్ల సంపద కోల్పోయారు. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితుల వల్ల మంగళవారం వరుసగా ఐదో సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 703.59 (1.23 శాతం) పాయింట్లు పతనమై 56,463.15 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఐదు రోజుల్లో సెన్సెక్స్ 2,984.03 (5.01 శాతం) పాయింట్లు కోల్పోయింది.
ఈక్విటీల్లో బలహీనతల వల్ల బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,08,067.6 కోట్లు పతనమై రూ.2,66,02,728.45 కోట్ల వద్ద స్థిర పడింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంతోపాటు ధరల పెరుగుదల, విదేశీ నిధులు తరలి వెళ్లడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది.
మంగళవారం ట్రేడింగ్‌లో భారీగా హెచ్డీఎఫ్సీ 5.50 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.73 శాతం నష్టంతో ముగిసాయి. ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, నెస్ట్లే ఇండియా తదితర స్క్రిప్ట్‌లు భారీగా పతనం అయ్యాయి.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.21 శాతం, మిడ్ క్యాప్ 1.20 శాతం నష్టాలతో ముగిసాయి. విదేశీసంస్థాగత ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకానికి తెగబడ్డారు. సోమవారం రూ.6,387.45 కోట్ల విలువైన షేర్లను విక్రయించేశారు.