Amazon Great Indian Festival 2024 | ప్రతి ఏడాది మాదిరిగా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి సేల్స్ ప్రారంభం అవుతుండగా, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. లాప్టాప్ల మీద 45 శాతం, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్ల మీద 65, ట్రావెల్ బుకింగ్స్, తదితరాలపై 60 శాతం వరకూ డిస్కౌంట్లు లభిస్తాయి. వేర్వేరు క్యాటగిరీల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది అమెజాన్. కొనుగోలు చేసే వస్తువులు, పేమెంట్ గేట్ వేస్ ఆధారంగా అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి. అవేమిటో చూద్దామా..
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2024లో ఎస్బీఐ బ్యాంకు కార్డు (డెబిట్ లేదా క్రెడిట్)లతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ యాప్, వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే వారు అమెజాన్ పే యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తారు. ఇలా చెల్లింపులు జరిపే వారికి రూ.1000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కనీసం రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2024లో అదనపు డిస్కౌంట్ పొందే మార్గం ‘అమెజాన్ పే రివార్డ్స్’. వస్తువుల కొనుగోళ్లు, వాటి ధర ఆధారంగా చేసే చెల్లింపులపై రివార్డు పాయింట్లు వస్తాయి. హోం అండ్ కిచెన్, ఫ్యాషన్, బ్యూటీ తదితర వస్తువులపై డిస్కౌంట్ కూపన్లు పొందేందుకు ఈ రివార్డు పాయింట్లు అందిస్తోంది అమెజాన్ పే.
అమెజాన్ పే గిఫ్ట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తున్నారా.. అయితే మీకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఉదాహరణకు మీరు అమెజాన్ పే గిఫ్ట్ కార్డు సాయంతో రూ.2500 చెల్లించారనుకుందాం.. రూ.75 క్యాష్ బ్యాక్ లభిస్తుందన్న మాట.