సోమవారం 13 జూలై 2020
Business - Feb 14, 2020 , 00:46:36

బెజోసా.. మజాకా

 బెజోసా.. మజాకా

ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌.. చారిత్రక వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1,200 కోట్లు (165 మిలియన్‌ డాలర్లు). ఒకప్పుడు ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కు చెందినదీ ప్రాంతం. ఇప్పుడు మీడియా మొగల్‌ డేవిడ్‌ గెఫెన్‌ నుంచి బెజోస్‌ కొనుగోలు చేసినట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది.

  • వార్నర్‌ ఎస్టేట్‌ @ రూ.1,200 కోట్లు

శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 13 ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌.. చారిత్రక వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1,200 కోట్లు (165 మిలియన్‌ డాలర్లు). ఒకప్పుడు ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కు చెందినదీ ప్రాంతం. ఇప్పుడు మీడియా మొగల్‌ డేవిడ్‌ గెఫెన్‌ నుంచి బెజోస్‌ కొనుగోలు చేసినట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. కాగా, ఈ డీల్‌ లాస్‌ ఏంజిల్స్‌ ప్రాంతంలో రికార్డు సృష్టించిందని, గతేడాది దాదాపు 150 మిలియన్‌ డాలర్లతో న్యూస్‌ కార్ప్‌ అధినేత రూపర్ట్‌ మర్దోచ్‌ కుమారుడు లచ్లన్‌ మర్దోచ్‌ కొన్న బెల్‌-ఎయిర్‌ ఎస్టేట్‌ను మించిపోయిందని జర్నల్‌ వెల్లడించింది. బెవర్లీ హీల్స్‌లోగల వార్నర్‌ ఎస్టేట్‌ 9 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. జార్జియన్‌ శైలి ప్రహరీతో ఉన్న ఈ ఎస్టేట్‌లో అతిథి గృహాలు, ఓ టెన్నిస్‌ కోర్టు, మరో గోల్ఫ్‌ కోర్స్‌ ఉన్నాయి. 1930ల్లో వార్నర్‌ బ్రదర్స్‌ మాజీ అధ్యక్షుడు స్వర్గీయ జాక్‌ వార్నర్‌ ఈ ఎస్టేట్‌ను నిర్మించారు. బెజోస్‌ సంపద విలువ 110 బిలియన్‌ డాలర్ల పైమాటే (సుమారు రూ.8 లక్షల కోట్లు). ది వాషింగ్టన్‌ పోస్ట్‌ న్యూప్‌పేపర్‌ యజమాని కూడా బెజోసేనన్న విషయం తెలిసిందే. గతేడాది భార్య మెకంజీతో విడిపోయిన బెజోస్‌.. ఆమెకు తన ఆస్తిలో పెద్ద మొత్తాన్నే భరణంగా చెల్లించిన సంగతీ విదితమే.






logo