Reliance-Future | రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చిక్కుల్లో పడిందా.. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి మార్గం సుగమం అవుతున్నదా?అంటే అవుననే సమాధానమే వస్తోంది.
విదేశీ మారక ద్రవ్య యాజమాన్యం చట్టం (ఫెమా) నిబంధనలను అమెజాన్ తప్పుగా అన్వయిస్తున్నదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో పేర్కొంటూ ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుందని ఫ్యూచర్ గ్రూప్‌ను అమెజాన్ గత నెలలో కోరినట్లు సమాచారం. ఈ మేరకు నెల రోజుల క్రితం రెండు కంపెనీల ప్రతినిధులు కలుసుకుని చర్చించారని తెలిసింది.
ఈ చర్చల్లో ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిశోర్ బియానీ, ఇతర అధికారులు, అమెజాన్ ఇండియా లీగల్ హెడ్ రాకేశ్ బక్షి, సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారని ఒక ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం. ఇరు సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు దాదాపు ఆరు గంటలు సమావేశమయ్యారని తెలుస్తున్నదని తెలుస్తోంది.
ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్ ఖరారు కావడానికి ఉదారంగా పరిహారం చెల్లించాలని ఫ్యూచర్ గ్రూప్‌ను అమెజాన్ కోరినట్లు వినికిడి. ఈ వివాదంపై కోర్టు బయట వివాద పరిష్కారానికి రెండు సంస్థలు సిద్ధమయ్యాయని విశ్వసనీయ సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
26 నుంచి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ పెంపు : వార్షిక ప్లాన్లకు కస్టమర్ల మొగ్గు!
MG Astor | మరింత ఆలస్యం కానున్న ఎంజీ ఆస్టర్ కార్ల డెలివరీ.. కారణం ఇదే..!
Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడాలో డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్ పోస్టుల భర్తీ!
మీ ఎల్ఐసీ ప్రీమియంను ఈపీఎఫ్వోనే చెల్లిస్తుంది
AP News | అమరావతి అంటే ప్రేమ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్