హైదరాబాద్ : ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త సమస్య తలెత్తింది. ఆ ఎఫెక్ట్ పలు కంపెనీలపై కనిపించింది. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఎంజీ మోటార్ కంపెనీ ఎంజీ ఆస్టర్ డెలివరీలపై ఈ ప్రభావం పడింది. దీంతో ఎంజీ ఆస్టర్ బుకింగ్ ,డెలివరీ తేదీలపై కీలకప్రకటన చేసింది ఆసంస్థ. ఎంజీ మోటార్ కంపెనీ సరఫరాదారులందరూ సెమీకండక్టర్ కొరతను ఎదుర్కొంటున్నారని, ఈ కారణంగా కార్ల ఉత్పత్తి అనుకున్నదానికంటే మరింతగా ఆలస్యం అవుతోంది. ఈ కారణంగానే కార్ డెలివరీలు కూడా ఆలస్యం కానున్నాయి.
ఈ విషయంపై ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా స్పందించారు. ఎంజీ ఆస్టర్ బుకింగ్ ,డెలివరీ తేదీలపై కీలకప్రకటన చేశారు. సెమీకండక్టర్ చిప్ సరఫరా ఆలస్యం కారణంగా డెలివరీ తేదీలు మారాయని పేర్కొన్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది 5వేల యూనిట్లను డెలివరీ చేస్తామని వాగ్దానం చేసినప్పటికీ,సెమీకండక్టర్ చిప్ కొరతతో డెలివరీలు వచ్చే ఏడాది చేసే అవకాశం ఉంది. అయితే ఎంజీ ఆస్టర్ మొదటి బ్యాచ్లో బుక్ చేసుకున్న కస్టమర్ల కార్లను లాంచ్ ధరకే విక్రయిస్తామని సంస్థ వెల్లడించింది.