Mohan Bhagwat | ముస్లింలు దేశంలో ఉండకూడదు అనుకుంటే వారు హిందువులు కాదు : మోహన్ భగవత్
Mohan Bhagwat : హిందూత్వ అంటే ముస్లింలను భారత్ నుంచి పంపేయడం కాదని, మతపరంగా విబేధాలున్నా మానవత్వం పరంగా ఏకత్వంతో ఉండటం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
Mohan Bhagwat : హిందూత్వ అంటే ముస్లింలను భారత్ నుంచి పంపేయడం కాదని, మతపరంగా విబేధాలున్నా మానవత్వం పరంగా ఏకత్వంతో ఉండటం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు.
భారత్‌లో ముస్లింలకు చోటు లేదని హిందువులు అనుకుంటే వారు హిందువులు కాదని ఆయన అన్నారు. ‘‘హిందూ మతం ఏ మతంపైనా వివక్ష చూపదు. దేశంలో హిందువులకు చోటు లేదు అనుకునే హిందువులు.. అసలైన హిందువులు కాదు. మతపరమైన విబేధాలున్నా మానవత్వం పరంగా ఐక్యంగానే ఉంటాం. సంప్రదాయపరంగా చూసినా భారత్.. ప్రతి ఒక్కరికీ ఆశ్రయం ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడా సురక్షితం కాదు అనుకునేవారు ఇండియాను సురక్షితమైన ప్రదేశంగా గుర్తించారు. ప్రపంచంలో మానవత్వం ఒక్కటే అనే జ్ఞానం ఆర్ఎస్ఎస్కు ఉంది. ఎన్ని వైవిధ్యాలు ఉన్నా మనమంతా ఒక్కటే అని చాటి చెప్పడం మా విధి.
హిందూ దేశం కావాలని అడుగుతుంటారు కదా.. ముస్లింలను బయటకు పంపిస్తారా అని కొందరు ముస్లింలు అడుగుతుంటారు. అలాంటివాళ్లకు చెప్పేదొక్కటే అలా అనుకునే హిందువులెవరూ హిందువులు కాదు. నేను, నాది అనుకున్నంత కాలం సమస్యకు పరిష్కారం దొరకదు. మేం, మనం అనుకున్న రోజే పరిష్కారం లభిస్తుంది’’ అంటూ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bharat
- Hindus
- mohan bhagwat
- RSS
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

