Man Throws Acid At Ex-Fiancee | పెళ్లి రద్దుపై ఆగ్రహించిన వ్యక్తి.. మహిళ, ఆమె సోదరిపై యాసిడ్ దాడి
Man Throws Acid At Ex-Fiancee | ఒక వ్యక్తి డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుసుకుని అతడితో జరుగాల్సిన పెళ్లిని మహిళ కుటుంబం రద్దు చేసింది. ఆగ్రహించిన అతడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ మహిళతో పాటు ఆమె సోదరిపై యాసిడ్‌తో దాడి చేశాడు. మహిళ కుటుంబ సభ్యులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
లక్నో: ఒక వ్యక్తి డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుసుకుని అతడితో జరుగాల్సిన పెళ్లిని మహిళ కుటుంబం రద్దు చేసింది. ఆగ్రహించిన అతడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ మహిళతో పాటు ఆమె సోదరిపై యాసిడ్‌తో దాడి చేశాడు. మహిళ కుటుంబ సభ్యులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (Man Throws Acid At Ex-Fiancee) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆవాస్ వికాస్ కాలనీకి చెందిన హర్ష్ భాటికి ఒక యువతితో పెళ్లి నిశ్చియమైంది. అయితే అతడు డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుసుకున్న కాబోయే భార్య కుటుంబం పెళ్లిని రద్దు చేసింది.
కాగా, పెళ్లి రద్దు కావడంపై హర్ష్ ఆగ్రహించాడు. శనివారం రాత్రి యాసిడ్ బాటిల్స్‌తో ఆ యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆమె తలుపు తీయగానే యాసిడ్ పోశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ మహిళ సోదరిపై కూడా యాసిడ్ పోశాడు. వారి కేకలు విన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నించిన హర్ష్‌ను పట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు. బాధిత మహిళల తండ్రి ఫిర్యాదు ఆధారంగా హర్ష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- acid
- Addicted
- Calling Off
- drugs
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

