FD | మరింత పొదుపు చేయడానికి సరైన వేదిక ఫిక్స్డ్ డిపాజిట్లే (ఎఫ్డీ)నని ఇప్పటికీ చాలామంది భారతీయుల, ముఖ్యంగా గృహస్తుల నమ్మకం. అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి నగదు లభ్యతతో కూడిన సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎఫ్డీలకు పేరున్నది మరి. మరికొందరు ఎఫ్డీలను సంపద వృద్ధికి మార్గాలుగా భావిస్తున్నారు. అయితే ఎఫ్డీ వడ్డీ క్యాలిక్యులేటర్తో మరింత పక్కాగా మదుపరులు పెట్టుబడులకు దిగవచ్చు.
ఏమిటీ క్యాలిక్యులేటర్?
ఎఫ్డీ క్యాలిక్యులేటర్లను దాదాపు అన్ని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నాయి. వీటి ద్వారా మెచ్యూరిటీ, వడ్డీ ఆదాయంపై మదుపరులు ఓ అంచనాకు రావచ్చు. దీని ద్వారా ఎఫ్డీ పెట్టుబడులు మనకు లాభదాయకమా? కావా? అన్నది సులువుగా ఎంచుకోవచ్చన్నమాట. ఇక ఎఫ్డీ క్యాలిక్యులేటర్ A= P(1+r/n)^n*t. సూత్రం ద్వారా పని చేస్తుంది. A అంటే మెచ్యూరిటీ మొత్తం, P అంటే ప్రిన్సిపల్ మొత్తం, r అంటే వడ్డీరేటు, t అంటే కాలపరిమితి, n అంటే చక్రవడ్డీ ఫ్రీక్వెన్సీ. 60 ఏండ్లలోపున్న మదుపరులు వివిధ కాలపరిమితుల్లో ఆయా వడ్డీరేట్లపై రూ.15,000 పెట్టుబడికి పొందే వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తాలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.