ఎయిర్‌లైన్స్‌కు ఇబ్బందులు తప్పవు
దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివుంటుందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అన్నారు. ఎయిర్‌లైన్స్‌లు సులభతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయని, అలాగే ప్రయాణికుల రైట్స్‌కు పెద్దపీట వేయడం కూడా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
- డీజీసీఏ చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్
న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివుంటుందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అన్నారు. ఎయిర్‌లైన్స్‌లు సులభతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయని, అలాగే ప్రయాణికుల రైట్స్‌కు పెద్దపీట వేయడం కూడా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
నిర్వహణ ఖర్చులు అధికం కావడం, దూరపు రూట్లలో సర్వీసులు అందించడం ఎయిర్‌లైన్స్‌కు పెద్దభారంగా మారుతున్నదని, అయినప్పటికీ భవిష్యత్తులో మంచి రోజులు రావచ్చునని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎయిర్‌లైన్స్‌ల సమస్యలు మరింత పెరిగాయన్నారు. దేశంలో ఇప్పటికే చాలా విమానయాన సంస్థలు దివాలా తీశాయని, ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.
అంతర్జాతీయ విమానయాన రంగంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని, డీజీసీఏ, పౌర విమానయాన నియంత్రణ మండలి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఇటీవలకాలంలో దేశీయంగా నడిచే విమాన సర్వీసుల్లో 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు విధించకుండా నియంత్రించినట్టు చెప్పారు.
భారత్‌లో ఎయిర్‌బస్ అసెంబ్లింగ్ లైన్
ప్రముఖ విమానయాన తయారీ సంస్థ ఎంబ్రాయిర్ బాటలోనే ఎయిర్‌బస్.. భారత్‌లో అసెంబ్లింగ్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ఎయిర్‌బస్ ముందుకొచ్చింది. ప్రాంతీయ విమానయాన సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ..ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎఫ్ఏఎల్..టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో కలిసి రెండు యూనిట్లను నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

