Festive Air Travel | ఫెస్టివ్సీజన్లో విమానయానానికి ఫుల్ డిమాండ్.. ఫేర్ కూడా ఎక్కువే.. ఎందుకంటే?!
Festive Air Travel | పండుగలకు టూరిస్ట్కేంద్రాలకు వెళ్లే విమాన టిక్కెట్ల ధరలు ఎక్కువే. చివరిక్షణంలో బుక్ చేసుకుంటే 70% అధికం.

Festive Air Travel | పండుగల సీజన్లో పర్యాటక కేంద్రాలకు, స్వస్థలాలకు వెళ్లడానికి అంతా ప్రాధాన్యం ఇస్తుంటారు. దేశీయంగా పలు కేంద్రాలకు వెళ్లే నాన్‌స్టాప్ విమాన చార్జీలు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. ముంబై నుంచి డెహ్రాడూన్, శ్రీనగర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, పాట్నా, కోచ్చి వంటి ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణ చార్జీలు కాసింత ప్రియమే. ఇక మాలె మినహా భారతీయులకు అనుమతించిన విదేశీ కేంద్రాలకు విమాన ప్రయాణ టిక్కెట్లు కూడా కాస్ట్లీనే.
వీకెండ్లో రిటర్న్ టికెట్ ఫుల్ కాస్ట్లీ..
దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన సందర్శకులు ఆదివారం గానీ, వీకెండ్లోగానీ తిరుగు ప్రయాణం కావాలని భావించే వారికి టిక్కెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్-నవంబర్ నెలల్లో దీపావళి సందర్భంగా ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకోని వారు వీకెండ్ లేదా ఆదివారం టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి బదులు సోమవారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. వీకెండ్ లేదా ఆదివారంతో పోలిస్తే మిగతా రోజుల్లో రిటర్న్ టిక్కెట్ 20-30 శాతం తక్కువ.
టిక్కెట్ల ధరల్లో ఇలా తేడాలు..
ఉదాహరణకు ముంబై-డెహ్రాడూన్ మధ్య నవంబర్ ఏడు (ఆదివారం) నాన్‌స్టాప్ ఫ్లయింట్లో రిటర్న్ ప్రయాణానికి టికెట్ ధర రూ.35 వేల నుంచి మొదలవుతుంది. అదే నవంబర్ ఎనిమిదో తేదీన (సోమవారం) టిక్కెట్ రూ.29,300 మాత్రమే పలుకుతుంది. ఫెస్టివ్ సీజన్లో హోటళ్లు, విమాన టిక్కెట్ల బుకింగ్ కోసం ఎంక్వైరీ చేసే వారి సంఖ్య 40-50 శాతం పెరుగుతోందని యాత్రా డాట్ కామ్ అధికార ప్రతినిధి చెప్పారు.
చివరిక్షణంలో బుక్ చేసుకుంటే 70% ఎక్కువ
చివరి క్షణంలో దీపావళి పండుగ సందర్భంగా విమాన టిక్కెట్ కొనుగోలు చేయాలంటే అదనంగా 70 శాతం చార్జీ చెల్లించాల్సి వస్తుందని ఈజీ మై ట్రిప్ కో ఫౌండర్ రికాంత్ పిట్టి చెప్పారు. ఇంతకుముందు గణేశ్ చతుర్థి వీకెండ్లో విమానయాన బుకింగ్స్ 65 శాతం పెరిగాయన్నారు. ఇక జన్మాస్టమి టైంలో 54 శాతం విమాన టికెట్లు బుకింగ్ అయ్యాయన్నారు. దీనిబట్టి ఫెస్టివ్ సీజన్లో టూరిస్ట్ కేంద్రాలకు వెళ్లడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.
ఆ విమానాల టిక్కెట్లే కాదు.. సీట్లూ కొరతే
బథిజా ట్రావెల్స్ ప్రతినిధి అనూప్ కనుగ స్పందిస్తూ విదేశీ రూట్లలో టిక్కెట్ల ప్రయాణ చార్జీలే కాదు.. నాన్‌స్టాప్ విమానాల్లో సీట్ల కొరత కూడా ఎక్కువేనని చెప్పారు. విమానయానం కోవిడ్ ముందునాటి పరిస్థితులకు వచ్చే వరకు ప్రతినెలా కనీసం 15-20 శాతం విదేశీ రూట్లలో విమానాల సర్వీసులను నడిపేందుకు అనుమతించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Facebook Post | ఫేస్బుక్ ఫొటోతో కటకటాలపాలైన వ్యక్తి.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?
TATA-Air India | టాటాసన్స్కు ఎయిరిండియా మేనేజ్మెంట్ వీజీ కాదా..?!
Fixed Diposits | ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు.. 7 శాతం వడ్డీ వరకు ఆఫర్!
TATA-Air India | ఎయిరిండియా టెక్నికల్ సపోర్ట్ ఇక టీసీఎస్ చేతికి..!
AWS Cloud Training | క్లౌడ్ కంప్యూటింగ్‌లో అమెజాన్ ఉచిత శిక్షణ..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Airfare
- festivs season
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

