Air India Privatisation | వాజపేయి సర్కార్ హయాంలో నిలిచిపోయిన ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై 2014లో నరేంద్రమోదీ సారధ్యంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. ఎయిర్ ఇండియా, దాని ఐదు అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మకంగా పెట్టుబడులను ఉపసంహరించడానికి 2017 జూన్లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియాలో వాటాల ఉపసంహరణ కోసం ప్యానెల్ ఆఫ్ మినిస్టర్స్ లేదా ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేట్ మెకానిజం (ఏఐఎస్ఏఎం)ను ఏర్పాటు చేసింది కేంద్రం.
2018 మార్చి : ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం ఇంటరెస్ట్ ఆఫ్ ఇంటెంట్ (ఈవోఐ) ఆహ్వానించింది. మిగతా 26 శాతం ప్రభుత్వ వాటా కలిగి ఉంటుంది. మే 14 బిడ్లకు చివరి తేది.. కానీ గడువులోగా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు.
2018 జూన్: ముడి చమురు ధరలు తగ్గే వరకు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియపై నెమ్మదిగా ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.
2020 జనవరి: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు మరోసారి ఈవోఐని ఆహ్వానించిన కేంద్రం. 100 శాతం వాటాల విక్రయానికి నిర్ణయం.ఎయిర్ ఇండియాలో 100 శాతం, ఏఐఎస్ఏటీఎస్తోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 50 శాతం వాటాలు ఉన్నాయి. ఐదు దఫాలు బిడ్ల దాఖలు గడువును పొడిగించి చివరకు డిసెంబర్ 14ను తుది గడువుగా ఖరారు చేసింది.
ప్రభుత్వం ఆహ్వానించిన ఈవోఐ ప్రకారం 2019 మార్చి నెలాఖరు నాటికి ఎయిర్ ఇండియా మొత్తం రుణాలు రూ.60,074 కోట్లు. బిడ్ గెలుచుకున్న సంస్థకు రూ.23,286.5 కోట్ల రుణాల బదిలీ.
2020 అక్టోబర్ : ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం బిడ్లు దాఖలు చేసే సంస్థలకు కేంద్రం తీపి వార్త. సంస్థ రుణాలను తీర్చాలా.. వద్దా.. నిర్ణయం ఇన్వెస్టర్లకే వదిలేసింది.
2020 డిసెంబర్: ఎయిర్ ఇండియా కోసం పలు బిడ్లు దాఖలయ్యాయని వెల్లడించిన కేంద్రం.
2021 మార్చి: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ లేదా మూసివేతే కేంద్రానికి శరణ్యం అన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. సంస్థకు ప్రతి రోజూ రూ.20 కోట్ల నష్టం అని వెల్లడి.
2021 ఏప్రిల్: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ఇన్వెస్టర్ల నుంచి ఫైనాన్సియల్ బిడ్లకు ఆహ్వానం. సెప్టెంబర్ 15 తుది గడువు.
2021 సెప్టెంబర్ : ఎయిర్ ఇండియా కోసం ఫైనాన్సియల్ బిడ్లు దాఖలు చేసిన టాటా గ్రూప్, స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్.
2021 అక్టోబర్ 8: ఎయిర్ ఇండియా టేకోవర్ బిడ్ కైవశం చేసుకున్న టాటా సన్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
వెల్కమ్ బ్యాక్, ఎయిర్ ఇండియా.. రతన్ టాటా ట్వీట్
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..