Air India | విస్తరణ దిశగా `మహారాజా`.. 5,700 మంది ఉద్యోగుల నియామకం..!
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3,800 మందికి పైగా క్రూ సిబ్బందితోపాటు 5,700 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3,800 మందికి పైగా క్రూ సిబ్బందితోపాటు 5,700 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది. ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఐదేండ్ల పరివర్తన ప్రణాళికలో భాగంగా `మహారాజా` కొత్త నియామకాలు చేపట్టింది. తాజాగా 11 అంతర్జాతీయ రూట్లతోపాటు 16 కొత్త మార్గాల్లో విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియా `శిఖ`లో కొత్తగా నాలుగు ఏ320 నియోస్, 14 ఏ321 నియోస్, ఎనిమిది బీ777, మూడు ఏ350 విమానాలు జత కలిశాయి. ఏడాది కాలంలో నియమించుకున్న వారిలో క్యాడెట్ పైలట్లు అమెరికాలోని భాగస్వామ్య ఫ్లయింగ్ స్కూళ్లలో శిక్షణ పొందారు. వారిలో తొలి బ్యాచ్ ఈ నెలాఖరులో విధుల్లో చేరతారని ఎయిర్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ శుక్రవారం సిబ్బందికి పంపిన మెసేజ్‌లో తెలిపారు.
ప్రైవేటీకరణ తర్వాత నియమితులైన క్యాబిన్ టీం తమ శిక్షణ పూర్తి చేసుకుని సర్వీసులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు. ఐదేండ్ల విహాన్.ఏఐ ప్లాన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా 3800 మందికి పైగా ఫ్లయింగ్ స్టాఫ్, 1950 మందికి పైగా నాన్ ఫ్లయింగ్ సిబ్బందిని నియమించుకున్నది.
ఇదిలా ఉంటే, టాటా సన్స్ ఆధీనంలోని బడ్జెట్ క్యారియర్ విస్తారా ఎయిర్ లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో విస్తారా పైలట్ల వేతన సవరణతోపాటు పలు అంశాలపై విస్తారా పైలట్లు సమ్మెకు దిగారు. విస్తారా పైలట్ల సమ్మెకు రెండు ఎయిర్ ఇండియా యూనియన్లు మద్దతు పలికాయి. పైలట్ల సమ్మె కారణంగా విస్తారా యాజమాన్యం పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నది. విస్తారా పైలట్లను యాజమాన్యం బాండెడ్ లేబర్‌గా పరిగణిస్తున్నదని ఎయిర్ ఇండియా యూనియన్లు ఆరోపిస్తున్నాయి. పైలట్ల ఫ్లయింగ్ అలవెన్స్ 40 గంటలకు కుదించడం, లీవ్ అప్రూవల్స్ తదితర అంశాల్లో అవకతవకలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిష్కరించాలంటూ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

