హైదరాబాద్, జనవరి 16: రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా హైదరాబాద్-రియాద్ల మధ్య విమాన సర్వీసును ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 2 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్‌లో మధ్యాహ్నాం 12.05 గంటలకు బయలుదేరనున్న విమానం రియాద్‌కు 3 గంటలకు చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో 4 గంటలకు రియాద్‌లో బయలుదేరనున్న సర్వీసు తిరిగి హైదరాబాద్‌కు రాత్రి 11 గంటలకు చేరుకోనున్నది. కేవలం సోమ, బుధ, శుక్ర వారాల్లో మాత్రమే ఈ సర్వీసు నడవనున్నది.
హైదరాబాద్-సూరత్‌ల మధ్య విమాన సర్వీసును ప్రారంభించబోతున్నట్లు స్టార్ ఎయిర్ ఇండియా ప్రకటించింది. నూతన రూట్లలో సర్వీలు అందించడంలో భాగంగా ఈ నెల 23 నుంచి హైదరాబాద్-సూరత్‌ల మధ్య వారానికి మూడు రోజులు (మంగళ, బుధ, గురు) మాత్రమే ఈ సర్వీసును నడుపుతున్నట్లు తెలిపింది.