Air India | హైదరాబాద్, ఆగస్టు 22: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. తాత్కాలికంగా పలు రూట్లలో విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి నేరుగా కోల్‌కతాలకు అదనపు ఫ్లైట్ సర్వీసును అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు వెల్లడించింది.
దుర్గ పూజ సందర్భంగా ఈ రూట్లలో అత్యధిక మంది ప్రయాణించే అవకాశం ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. కోల్‌కతాలో మధ్యా హ్నం 3.15 గంటలకు బయలుదేరనున్న ఏఐ530 సర్వీసు హైదరాబాద్‌కు సాయంత్రం 5.40 గంటలకు చేరుకోనున్నది.
తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరనున్న ఈ సర్వీసు కోల్‌కతాకు 10.40కి చేరుకోనున్నది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు మాత్రమే నడపనున్నట్లు తెలిపింది.