న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఐటీ సేవల సంస్థ ఎహెడ్.. హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. గతేడాది గురుగ్రామ్‌లో 400 మంది సిబ్బందితో డెలివరీ ఆఫీస్‌ను ప్రారంభించిన సంస్థ..తాజాగా ప్రారంభించిన కార్యాలయం కోసం వచ్చే ఏడాదిలోగా 500 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ప్రవీణ్ గ్రోవర్ తెలిపారు. ఉత్తర భారతంతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభ కలిగిన టెక్నాలజీ నిపుణులు అత్యధికంగా ఉన్నారని, వీరితో క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు.
అదానీ చేతికి ల్యాంకో
న్యూఢిల్లీ, ఆగస్టు 22: అదానీ మరో విద్యుత్ ప్లాంట్‌ను హస్తగతం చేసుకున్నది. ఎన్సీఎల్టీ వద్ద ఉన్న ల్యాంకో అమర్కంటక్ పవర్ లిమిటెడ్‌ను రూ.4,101 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ప్రతిపాదనకు ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చింది. ఎల్ఏపీఎల్ ప్లాంట్‌లో 100 శాతం వాటా కొనుగోలు ప్రతిపాదనకు అనుమతినిచ్చింది.