ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు
యూరప్‌లో ఉక్రెయిన్-రష్యా యుద్దంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు తలెత్తాయని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కొవిడ్-19 మూడోవేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తేరుకున్న సమయంలోనే హఠాత్తుగా ప్రపంచానికి తీవ్ర ఆహార, ఇంధన సంక్షోభం మొదలయ్యిందన్నారు.
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
హైదరాబాద్, నవంబర్ 19: యూరప్‌లో ఉక్రెయిన్-రష్యా యుద్దంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు తలెత్తాయని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కొవిడ్-19 మూడోవేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తేరుకున్న సమయంలోనే హఠాత్తుగా ప్రపంచానికి తీవ్ర ఆహార, ఇంధన సంక్షోభం మొదలయ్యిందన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆర్బీఐ ఎకనామిక్, పాలసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వార్షిక సదస్సులో దాస్ మాట్లాడుతూ కొవిడ్ పాండమిక్ సంక్షోభంతో ఇంటి నుంచి పనిచేయడం ద్వారా డైరెక్ట్ ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌ను, సాఫ్ట్వేర్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసే అవకాశం కలిగిందన్నారు. మరోవైపు పాండమిక్‌తో ఏర్పడిన డిమాండ్, సరఫరా షాక్‌లతో ద్రవ్య విధాన రూపకల్పనకు సవాళ్లు ఎదురయ్యాయన్నారు. ఏ తరహా ఆర్థిక ఉద్దీపనలను ఇవ్వాలి, అవి ఏ మేరకు పనిచేస్తాయి అనే అంశాల్ని కొత్తగా విశ్లేషించాల్సి వచ్చిందన్నారు. తగిన ద్రవ్య విధానాన్ని, ఉద్దీపనను రూపొందించడానికి కొవిడ్ తొలివేవ్‌లో గణాంకాల సమీకరించడం ప్రధాన సవాలుగా పరిణమించిందని, తీవ్రమైన రెండో వేవ్‌లో ఆయా రంగాల ఒత్తిడిపై సమాచారాన్ని సేకరించడం క్లిష్టమయ్యిందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అటుతర్వాత యుద్దం తెచ్చిపెట్టిన కొత్త సవాళ్లను ప్రస్తావించారు. అవి..
- కమోడిటీ ధరలు ఆకాశాన్నంటాయి. సరఫరా సమస్యలు తీవ్రతరమయ్యాయి.
- మారుతున్న భౌగోళికరాజకీయ పరిణామాలకు అనుగుణంగా కీలక సరఫరాల కోసం ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది
- ఈ కారణాలతో ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం వ్యాపించింది.
- ఈ షాక్‌ల ప్రభావం ఎప్పటివరకూ ఉంటుంది? ఎంతవరకూ ఉంటుంది? వీటికోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ పాలసీ సాధనాల ప్రయోజనం ఏ మేరకు? ఈ కొత్త పరిశోధనా అంశాలు విధాన నిర్ణేతల ముందు ఉన్నాయి.
- వివిధ దేశాలు వాణిజ్య విధాన చర్యల్ని (టారీఫ్, నాన్-టారీఫ్), ఆర్థిక చర్యల్ని (పన్ను కోతలు, సబ్సిడీలు, ధరల్ని ఫ్రీజ్ చేయడం) తీసుకుంటున్నాయి. ఇటువంటి చర్యలు భారత్‌కు ఏ మేరకు అవసరం అన్నది పరిశోధించాలి.
- ఇందుకోసం ఆర్బీఐ పరిశోధనా విభాగం సంసిద్ధమై ఉండాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

