Minister Sridhar Babu | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జీఎఫ్ లైఫ్ టెక్ కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ప్రారంభంతో తెలంగాణ.. ప్రపంచ స్థాయి సాంకేతిక, నూతన పరిశోధనల గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ఈ సెంటర్ వల్ల ప్రస్తుతం 200 మందికి ఉద్యోగాలు లభించాయని, వచ్చే మూడేండ్లలో ఈ సంఖ్య 500 దాటగలదన్న విశ్వాసాన్ని కనబర్చారు. గచ్చిబౌలి విప్రో సరిల్ వద్ద ఏర్పాటైన జీఎఫ్ లైఫ్ టెక్ జీసీసీని గురువారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ కేంద్రం నుంచి జీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించగలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.