న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అదానీ గ్రూపు షేర్ల పతనం కొనసాగుతున్నది. ఉదయం భారీగా లాభపడిన పలు కంపెనీల షేర్లు చివర్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ షేరు 5 శాతం వరకు పడిపోగా..అదానీ ట్రాన్స్మిషన్ షేరు 4.93 శాతం కోల్పోయింది. వీటితోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీలు కూడా పతనాన్ని నమో దు చేసుకున్నాయి.
స్వల్పంగా పెరిగిన సూచీలు
స్టాక్ మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. బీఎస్ఈ సెన్సెక్స్ 44.42 పాయింట్లు పెరిగి 61,319.51 చేరుకోగా, నిఫ్టీ 20 పాయింట్లు ఎగబాకి 18,035 వద్ద ముగిసింది.