Adani Group | 12 ఎయిర్‌పోర్ట్‌లపై అదానీ గ్రూప్ గురి.. మరిన్ని విమానాశ్రయాల కోసం బిడ్ వేస్తామన్న అదానీ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో
Adani Group | ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్‌పోర్ట్‌లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వం జరిపే బిడ్డింగ్‌లో మరిన్ని విమానాశ్రయాలకు బిడ్ చేస్తామని అదానీ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో అరుణ్ భన్సాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
న్యూఢిల్లీ, మార్చి 22: ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్‌పోర్ట్‌లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వం జరిపే బిడ్డింగ్‌లో మరిన్ని విమానాశ్రయాలకు బిడ్ చేస్తామని అదానీ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో అరుణ్ భన్సాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణకు గత రౌండ్ బిడ్డింగ్‌లో ఆరు విమానాశ్రయాల్ని అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. వచ్చే రోజుల్లో 12 ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటుపరం చేసే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
నవీ ముంబైలో 2,866 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న అదానీ గ్రూప్.. గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లను నిర్మిస్తున్నది. నవీ ముంబై విమానాశ్రయం 2024 డిసెంబర్లో ప్రారంభమవుతుందని భన్సాల్ వెల్లడించారు. ఈ విమానాశ్రయం తొలిదశలో వార్షికంగా 2 కోట్ల మంది ప్రయాణీకుల్ని చేరవేస్తుందని, ఈ సామర్థ్యం 2036కల్లా 9 కోట్లకు పెరుగుతుందన్నారు. నవీ ముంబైతో సహా బిడ్డింగ్‌లో పొందిన 6 ఎయిర్‌పోర్ట్‌లు కాకుండా జీవీకే గ్రూప్ నుంచి టేకోవర్ చేసిన ముంబై విమానాశ్రయాన్ని ప్రస్తుతం అదానీ గ్రూప్ నిర్వహిస్తున్నది. తాము దేశీయ ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపారంపై బుల్లిష్‌గా ఉన్నామని అదానీ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో చెప్పారు.
విస్తరణలో వెనక్కు తగ్గం
తాము చేపట్టిన ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపార విస్తరణలో వెనక్కు తగ్గేది లేదని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల మేరకు పెట్టుబడులు చేస్తామని అరుణ్ భన్సాల్ స్పష్టం చేశారు. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దారుణ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ ప్రస్తుతం గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్సిడరీగా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

