ఫాక్స్‌కాన్‌కు అభయ హస్తం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
- ఆ సంస్థ ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ
- కొంగరకలాన్‌లో పరిశ్రమకు గతంలోనే ఒప్పందం
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సులభంగా మంజూరు చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైంది.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొంగరకలాన్‌లో ఏర్పాటుచేస్తున్న ఫాక్స్‌కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు, సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్టాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలోనే..
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో పరిశ్రమ స్థాపనకు కేసీఆర్ ప్రభుత్వంతో గత మార్చిలోనే ఒప్పందం చేసుకున్నది. ప్రభుత్వం కొంగరకలాన్‌లో భూమిని కేటాయించగా, గత మేలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఫాక్స్‌కాన్ మన రాష్ట్రంలో దశలవారీగా 550 మిలియన్ డాలర్ల్ల పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, మొదటి దశలో, వచ్చే రెండేండ్లలో 25,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఫాక్సాకాన్ సంస్థ ప్రధానంగా ఆపిల్ ఐఫోన్లను తయారుచేస్తుంది.
సంస్థ ప్రధాన కస్టమర్లలో గూగుల్, జియోమీ, అమెజాన్, హ్యూలెట్ ప్యాకర్డ్, హ్యూవాయ్, సిస్కో, నెన్టెండో, సెగా అలీబాబా గ్రూప్, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా తదితర కంపెనీలు ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబదూర్(తమిళనాడు), తెలంగాణ(కొంగరకలాన్), బెంగళూరు(కర్ణాటక)లో పరిశ్రమలను ఏర్పాటుచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

