లోకల్ టెల్కోల కంట్రోల్లోనే 5జీ: కేంద్రమంత్రి రవిశంకర్ ఆకాంక్ష

న్యూఢిల్లీ: జాతీయ కంపెనీల నియంత్రణలోనే 5జీ ప్రధాన నెట్వర్క్ బాధ్యతలు ఉండాలని కేంద్ర టెలికాంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. దేశంలో కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం సాధనాలతో వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. త్వరలో 5జీ టెక్నాలజీపై ప్రయోగాలకు త్వరలోనే టెలికం ప్రొవైడర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వనున్నదని చెప్పారు.
‘ఇప్పటికే మనం 4జీ టెక్నాలజీలో వెనుకబడి ఉన్నాం. కానీ 5జీలో మాత్రం ఇతరదేశాల కంటే ముందుండాలి. ఇందుకోసం ఇప్పటికే పరీక్షావేదికను సిద్ధం చేశాం, త్వరలోనే వీటికి అనుమతులు రానున్నాయి. అయితే, వీటి ప్రధాన నెట్వర్క్ మాత్రం భారతీయ కంపెనీ చేతుల్లోనే ఉండాలి’ అని చెప్పారు. కేవలం టెక్నాలజీలో మార్పులే కాకుండా 5జీ అందుబాటులోకి రావడంతో పలు అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే సమాచార ఆర్థికవ్యవస్థలో భారత్ అతిముఖ్యమైన కేంద్రంగా నిలవాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆకాంక్షించారు.
రెండేండ్ల క్రితమే దేశంలో 5జీ నెట్వర్క్ ప్రయోగాలను చేయాలని నిర్దేశించుకున్న టెలికాం శాఖ, 2020లోనే వీటి సేవలు అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకుంది. అయితే, రక్షణ శాఖ, అంతరిక్ష విభాగం కూడా 5జీకి గుర్తించిన స్పెక్ట్రమ్‌లో భాగస్వామ్యం కావడంవల్ల ఆ ప్రక్రియలో కొంత ఆలస్యమైనట్లు తెలుస్తున్నది. ఇక టెక్నాలజీ నిపుణుల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా 5జీ నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తాజాగా దేశంలో వీటిపై ప్రయోగాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వృద్ధులతో ప్రయాణమా..ఇలా చేయండి
- బీజేపీ దేశంలో విషం నింపుతుంది: శరద్‌పవార్
- ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- ‘అధికారులను కర్రతో కొట్టండి’.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు వరసిద్ధి వినాయకుడి పట్టు వస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్