సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Jan 19, 2020 , 00:21:20

కష్టమే కానీ.. అసాధ్యం మాత్రం కాదు: గడ్కరీ

 కష్టమే కానీ.. అసాధ్యం మాత్రం కాదు: గడ్కరీ

ఇండోర్‌ (ఎంపీ), జనవరి 18: దేశ ఆర్థిక వ్యవస్థను 2024కల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్య సాధన కష్టమే కాని, అసాధ్యం మాత్రం కాదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దేశీయోత్పత్తిని పెంచుకుని, దిగుమతులపై ఆధారపడటం తగ్గిస్తే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ ఇండోర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 29వ అంతర్జాతీయ నిర్వహణ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. బలమైన రాజకీయ వ్యవస్థతో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు. ‘భారత్‌లో పుష్కలమైన వనరులున్నాయి. ఉత్పాదక సామర్థ్యం కూడా ఉన్నది. అయినప్పటికీ ఏటా ఔషధాలు, వైద్య పరికరాలు, బొగ్గు, కాపర్‌, పేపర్లు తదితర వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం’ అన్నారు. 


logo