న్యూఢిల్లీ, జూన్ 5: పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై 0.05 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఎలక్ట్రియేతర వాహనాలతో పోలిస్తే ఈవీలకు ఈ రాయితీ వర్తించనున్నదని పేర్కొంది.
దీంతో ఈవీలపై వడ్డీరేటు 8.30 శాతానికి దిగిరానున్నది. దీంతోపాటు ప్రాసెసింగ్/డాక్యుమెంటేషన్ ఫీజును ఎత్తివేసిన బ్యాంక్..తీసుకున్న రుణాలను 120 నెలల్లో తిరిగి చెల్లింపులు జరుపకోవచ్చును.