న్యూఢిల్లీ, మార్చి 19: టెలికాం యూజర్లు మరింత పెరిగారు. ఈ ఏడాది తొలి నెలలో భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి 44 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు జత కాగా, రిలయన్స్ జియో పరిధిలోకి 24.37 లక్షల మంది చేరినట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దీంతో దేశీయ టెలికాం దిగ్గజం జియో మొత్తం వైర్‌లైస్ సబ్‌స్ర్కైబర్లు 49.14 కోట్లకు చేరారు.
అలాగే భారతీ ఎయిర్టెల్ కస్టమర్లు కూడా 46.77 కోట్లకు చేరుకున్నారు. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మరో 4.11 లక్షల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది. దీంతో కంపెనీ వైర్లెస్ కస్టమర్లు 19.9 కోట్లకు చేరారు. అలాగే బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్లు 105.27 కోట్లకు చేరుకున్నారు.