NCC | హైదరాబాద్, నవంబర్ 4: గడిచిన నెలకుగాను రూ.3,496 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని ఎన్సీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో రూ.2,684 కోట్ల విలువైన ఆర్డర్ బిల్డింగ్ డివిజన్ నుంచి రాగా, రూ.538 కోట్ల విలువైన ఆర్డర్ ఎలక్ట్రికల్ డివిజన్ నుంచి రాగా, మరో రూ.274 కోట్ల విలువైన ఆరర్లు ఆయా విభాగాల నుంచి వచ్చాయని తెలిపింది. ఈ ఆర్డర్లు పలు ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి వచ్చాయి.
తాజ్ జీవీకే ఆకర్షణీయం
హైదరాబాద్, నవంబర్ 4: తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.107.37 కోట్ల ఆదాయంపై రూ.19.65 కోట్ల పన్ను చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.90.46 కోట్ల ఆదాయంతో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ సందర్భంగా తాజ్ గ్రూపు చైర్మన్ జీవీకే రెడ్డి మాట్లాడుతూ..బెంగళూరులో నయనీకరిస్తున్న తాజ్ హోటల్ వచ్చే ఏడాది చివరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.