న్యూఢిల్లీ, మే 8 : దక్షిణ కొరియాకు చెందిన వాహన సంస్థ కియా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. కారెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలోభాగంగా ‘క్లావిస్’ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన మల్టీ-పర్పస్ వాహనమైన కారెన్స్లోనే ఇది ప్రీమియం వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ధర, ఇతర వివరాలు వెల్లడించలేదు. 1.5 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్‌లో ఆరు స్పీడ్ గేర్లు, 26 ఇంచుల డిస్ప్లే వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
ఈ మాడల్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద రూ.25 వేలు ముందస్తుగా చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ నేషనల్ హెడ్, హర్దీప్ సింగ్ తెలిపారు. ఈ నూతన మాడల్‌తో మల్టీపర్పస్తోపాటు ఎస్యూవీ విభాగంలో పోటీ మరింత తీవ్రతరంకానున్నదన్నారు. గడిచిన సంవత్సరంలో 60 వేల యూనిట్ల వాహనాలను విక్రయించగా, ఈ నూతన మాడల్‌తో ఈ ఏడాది 20-25 శాతం వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.