న్యూఢిల్లీ, జనవరి 29: రియల్టీ సేవల సంస్థ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 18.2 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని రూ.613 కోట్లతో కొనుగోలు చేసింది.
సైస్టెన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఈ కమర్షియల్ స్థలంలో 100 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ కొనుగోలు ఒప్పందానికి కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ప్రస్తుత ఆర్థికసంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ నికర నిర్వహణ ఆదాయం 8 శాతం ఎగబాకి రూ.521.8 కోట్లకు ఎగబాకింది.