హైదరాబాద్, మే 12: లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని దక్షిణ భారతీయ ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన కాసాగ్రాండ్.. హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. కాసాగ్రాండ్ హాస్ఫోర్డ్ పేరిట రూ.320 కోట్ల టర్నోవర్తో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర్లో నగర దక్షిణాన, శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఓ అత్యంత విలాసవంతమైన విల్లా కమ్యూనిటీని శుక్రవారం ప్రారంభించింది. 10.1 ఎకరాల్లో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 140 ప్రత్యేకమైన బ్రిటిష్ ైస్టెల్ అల్ట్రా-లగ్జరియన్ 4బీహెచ్కే విల్లాలను కాసాగ్రాండ్ కంపెనీ నిర్మించనున్నది. ఇక్కడ 60కిపైగా ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు, హోమ్ థియేటర్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నది. కాగా, 2024 ఆఖరుకల్లా రూ.3,000 కోట్ల టర్నోవర్తో నగరంలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ శ్రేణి రెసిడెన్షియల్ కమ్యూనిటీలను నిర్మించే దిశగా వెళ్లనున్నట్టు ఈ సందర్భంగా సంస్థ ప్రకటించింది.