న్యూఢిల్లీ, జూన్ 15: ఇంధనాలపై విధించే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి తగ్గించింది. టన్ను క్రూడాయిల్‌పై విధించే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని రూ.5,200 నుంచి రూ.3,250కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన రేట్లు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని జూలై 1, 2022న విధించిన విషయం తెలిసిందే.