Dal Face pack | టమాటా పప్పుతో ఇలా చేస్తే మీ ముఖం నిగనిగలాడిపోతుంది
Dal Face pack | భారతీయ వంటకాల్లో పప్పు ఉండాల్సిందే. పప్పు దినుసులు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికీ ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు.. ఇలా ప్రతి దినుసులో ఔషధ గుణాలు అపారం.
శనగపిండి, పప్పు : శనగపిండి, పప్పు కలిపి ఉడికించాలి. నీరు తక్కువగా పోసి పేస్టులా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని శరీరమంతా రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే.. మృతకణాలు తొలగిపోయి, చర్మం కాంతిమంతం అవుతుంది.
టమాట, పప్పు : శరీరంపై పేరుకుపోయిన మలినాలను తొలగించే ప్రయత్నంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది టమాట. దీనికి పప్పును జోడిస్తే.. ఫలితాలు బాగుంటాయి. పప్పును మెత్తగా చేసుకొని, అందులో టమాట కలిపి ముఖానికి పట్టిస్తే.. మృతకణాలు తొలగిపోతాయి.
అలొవెరా, పప్పు : కలబంద, పప్పును కలిపి రుబ్బి.. శరీరానికి పట్టిస్తే.. అనేక ప్రయోజనాలు. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే.. మేలిమి ఛాయ సొంతం. కానీ, నాణ్య మైన అలొవెరానే ఎంచుకోవాలి.
పప్పు, పాలు : పప్పు పూర్తిగా ఉడకక ముందే.. తగినన్ని పాలను జోడించాలి. పేస్టుగా చేసుకుని చర్మంపై రాసుకుంటే ముఖారవిందం మెరుగ్గా ఉంటుంది.
నెయ్యి, పప్పు : పప్పు, నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి ఎంతోమంచిది. నెయ్యిలోని కొవ్వులు చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతాయి. నెయ్యికి బదులు తేనెతోనూ ప్రయత్నించవచ్చు. ఇవి రెండూ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.
పసుపు, పప్పు : చర్మ, ముఖ సంరక్షణలో పసుపు కీలకపాత్ర పోషిస్తుంది. రుబ్బిన పప్పులో చెంచాడు పసుపు కలిపి చర్మానికి, ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖకాంతిలో మార్పు మీకే తెలుస్తుంది.
Read More :
“ముఖం సన్నగా అందంగా కనిపించాలా? అయితే ఇలా చేసి చూడండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

