మిలమిల మెరిసే చర్మం కోసం ఈ ఆయుర్వేద ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేయండి
Ayurvedic Face pack | ఎండ వేడికి చర్మం నిర్జీవంగా మారుతుంది. డీహైడ్రేషన్ కారణంగా పగలడం, దురదలు రావడం లాంటివీ జరుగుతాయి. అయితే, బయటి వేడికి తట్టుకుంటూ మిలమిల మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి. శరీర తత్వాలను బట్టి వివిధ ప్యాక్‌లను సూచిస్తున్నది సనాతన వైద్య విధానం.
వాత: ఈ శరీర తత్వం వారిది పొడి చర్మం. ఇలాంటి వాళ్లు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ముఖానికి పట్టించి సుమారు అరగంట అలానే ఉంచి, గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. దాంతో చర్మం మృదువుగా తయారవుతుంది.
పిత్త: ఈ శరీర తత్వం ఉన్నవాళ్ల చర్మం జిడ్డుగా మొటిమలతో కూడి ఉంటుంది. ఇలాంటివారు ఒక టేబుల్ స్పూన్ గంధం, అర టేబుల్ స్పూన్ అతి మధురం పొడి, పావు టేబుల్ స్పూన్ మునగాకు పొడి తీసుకుని.. అందులో సరిపడా రోజ్‌వాటర్ పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి పట్టించి, అరగంట తర్వాత మామూలు నీళ్లతో కడిగేయాలి.
కఫ: కఫ శరీర తత్వం వాళ్ల చర్మం సాధారణంగా ఉంటుంది. వీళ్లు పావు కప్పు పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె, కొంచెం పసుపు పొడి, అర టేబుల్ స్పూన్ బియ్యపు పిండి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీళ్లతో కడిగితే చక్కటి ఫలితం ఉంటుంది.
Read More :
“Skincare | జిడ్డు చర్మం త్వరగా ముడతలు పడదా.. ఇది నిజమేనా !!”
“ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- skin
- skin care
- Skincare
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

